మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ కట్ట నాగరాజు గారు వెబ్సైట్ ఆవిష్కరణ చేయడం జరిగింది
నా తోటి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగ సోదరులకు, విప్లవాత్మక ‘మే డే’ (కార్మిక దినోత్సవం) శుభాకాంక్షలు!
ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో ప్రాణాలకు తెగించి, అహర్నిశలు శ్రమిస్తూ సమాజానికి వెలుగునిస్తున్న మన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ నా వందనాలు.🙏
మనం కోరుకుంటున్న ‘సంస్థలో విలీనం’ అనేది కేవలం డిమాండ్ మాత్రమే కాదు, అది మన హక్కు. మన శ్రమకు తగిన గుర్తింపు దక్కాలి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో తోటి కార్మికులను ప్రభుత్వం ఎలా గుర్తించిందో, మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా మన కార్మిక శ్రమను ప్రభుత్వం గుర్తించేలా మన నినదమని వినిపిద్దాం.
ఎవరినీ దూషించడం మన లక్ష్యం కాదు, మన హక్కుల సాధనే మన లక్ష్యం. మనం చేసే పోరాటం మన చైతన్యానికి ప్రతీక కావాలి. జేఏసీ (JAC) నాయకత్వంలో మనమంతా ఏకతాటిపై నిలబడి, సంస్థలో విలీనం కోసం గళం ఎత్తుదాం.
కలిసి నడుద్దాం! కలిసి పోరాడదాం!
మన సమస్యలను, మన గళాన్ని ప్రభుత్వం మరియు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి మన సోషల్ మీడియా వేదికలను సాధనాలుగా వాడుకుందాం. అందుకొరకు సోషల్ మీడియాలో వెబ్సైటు, twitter ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ సహాయంతో ప్రతి ఒక్క కార్మికుడికి మనం చేసే ప్రతి కార్యచరణ మీ చెరవాణిలోనే మీకు తెలిసే విధంగా ఈ మేడే కానుకగా రిలీజ్ చేయబోతున్నము ఎవరో చెబితే కార్మికులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇకమీదట రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మీ యొక్క సెల్ ఫోన్ లోనే ఈ యొక్క సోషల్ మీడియా చూస్తూ ప్రతి జిల్లా గురించి తెలుసుకోవచ్చు ఇది కేవలం కార్మికులతో ఏర్పడిన జేఏసీ కాబట్టి ప్రతి విషయం అనేది కార్మికులకి నేరుగా తెలుసుకునే విధంగా తెలియజేయడమే మా యొక్క ఉద్దేశం మరొకసారి మీ అందరికీ మే డే శుభాకాంక్ష లతో
నేను సైతం APVCWJAC తో✊🏻:
🌐 వెబ్సైట్: https://apvcwjac.in ( website ద్వోర మెరుగైన సమాచారం కోసం పని జరుగుతుంది 🚧)
📘 Facebook: https://facebook.com/APVCWJAC
✖️ X (Twitter): https://x.com/apvcwjac
📸 Instagram: https://www.instagram.com/apvcwjac/
▶️ Youtube: https://www.youtube.com/@apvcwjac
సంస్థల విలీనం కోసం.. మన హక్కుల సాధన కోసం.. ఐక్యంగా ముందుకు సాగుదాం.
జై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ! ✊🚩
ఇట్లు
మీ కట్ట నాగరాజు చైర్మెన్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ