TOOs/Circulars

మన తోటి కార్మికులతో పంచుకుందాం

అధికారిక ఉత్తర్వులు & సర్క్యులర్ల సమాచార నిధి

T.O.O.’s & CIRCULARS REPOSITORY | APVCWJAC

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ కార్మికుల హక్కులు, సంక్షేమం, సెలవులు, మరియు కారుణ్య నియామకాలకు సంబంధించి APTRANSCO, APGENCO, DISCOMs యాజమాన్యాలు జారీ చేసిన అధికారిక ఆదేశాలు & సమావేశ నిర్ణయాల సంకలనం.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (APVCWJAC) సందేశం

“సంస్థలో విలీనం – ఉద్యోగ భద్రత” అనే పవిత్రమైన లక్ష్యంతో సాగుతున్న మన జేఏసీ (JAC) పోరాటంలో భాగంగా, కార్మికులకు తమ చట్టపరమైన హక్కులపై పూర్తి అవగాహన కల్పించడం మన బాధ్యత. అందుకోసం, ప్రభుత్వ విభాగాల నుండి కాంట్రాక్ట్ కార్మికుల కొరకు జారీ చేయబడిన TOOs/Circulars అన్ని రకాల అధికారిక ఉత్తర్వులు, సర్క్యులర్ల లైవ్ డేటాను ఇక్కడ అందుబాటులో ఉంచాము.

📌 ముఖ్యమైన గమనిక (కార్మికులు గమనించగలరు): మన APVCWJAC వెబ్‌సైట్‌లో ఈ సమాచార నిధిని ప్రారంభ దశలో భాగంగా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ముఖ్యమైన TOOs/Circulars ఉత్తర్వులను పొందుపరిచాము. ప్రభుత్వ విభాగాల నుండి సంబంధించిన ప్రతీ ఒక్క చట్టపరమైన జీవో మరియు సర్క్యులర్‌ను నిరంతరం ఈ షీట్ నందు లైవ్‌గా అప్‌డేట్ చేస్తూ ఉంటాము. మీకు కావలసిన జీవో లేదా డాక్యుమెంట్ వివరాల కోసం క్రింది కార్డ్స్‌ను వీక్షించగలరు.
కేంద్ర గూగుల్ షీట్ (TOO’S / Circulars) ద్వారా డేటా అనుసంధానించబడింది
గూగుల్ షీట్ తెరవండి
కారుణ్య నియామకం APTRANSCO 20.11.2025 నెంబర్: 01

(Minutes of the Meeting) ప్రకారం… “అదనపు అంశాలు – పాయింట్ నెం. 3-(iv)” కు సంబంధించి, విధి నిర్వహణలో మరణించిన అవుట్‌సోర్సింగ్ కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం (ఉద్యోగం) కల్పించవలసిందిగా అభ్యర్థన – కొన్ని ముఖ్యమైన ఆదేశాలు/సూచనలు జారీ చేయుట గురించి.

సెలవులు & క్యాజువల్ లీవ్స్ APTRANSCO 22-01-2013 నెంబర్: 01

8 Paid Holidays & 15 Days Casual Leaves (CL’s) – Addl-Secy-TOO-Ms-321 | అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ సిబ్బందికి 8 చెల్లింపు సెలవులు మరియు 15 రోజుల సాధారణ సెలవుల (CL) మంజూరు ఉత్తర్వులు.

మహిళా ఉద్యోగుల సెలవులు APTRANSCO 30-04-2021 నెంబర్: 02

APTRANSCO — Extension of Five (5) Days Additional Casual Leave Facility to all the Women Employees | మహిళా ఉద్యోగులందరికీ అదనంగా 5 రోజుల క్యాజువల్ లీవ్ (CL) సౌకర్యం కల్పిస్తూ జారీ చేసిన అధికారిక ఉత్తర్వు.

సాధారణ సెలవులు (Holidays) APTRANSCO 22.12.2025 నెంబర్: 03

General Holidays and Optional Holidays for the Year 2026 – APTRANSCO | విద్యుత్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది కోసం 2026 సంవత్సరపు సాధారణ సెలవులు మరియు ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవుల అధికారిక జాబితా.

జేఏసీ చర్చల నిర్ణయాలు APTRANSCO 17.10.2025 నెంబర్: 01

ఎపిట్రాన్స్‌కో (APTRANSCO) – పారిశ్రామిక సంబంధాలు – విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (APSPE JAC) ఇచ్చిన ఉద్యమ నోటీసుపై యాజమాన్యం జరిపిన చర్చలు – అంగీకరించిన ముఖ్యాంశాలు మరియు తీసుకున్న నిర్ణయాల అధికారిక నివేదిక (Minutes of Meeting).

కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు APTRANSCO 27.10.2025 నెంబర్: 02

ఎపిట్రాన్స్‌కో (APTRANSCO) – (Industrial Relations) – థర్డ్ పార్టీ ఏజెన్సీలు/కాంట్రాక్టర్ల ద్వారా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, అధ్యయనం చేయడం కొరకు ఒక ఉన్నత స్థాయి కమిటీ (Committee) ని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయుట గురించి.