Karyacharana

మన తోటి కార్మికులతో పంచుకుందాం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ

APVCW JAC అధికారిక ఉద్యమ కార్యాచరణ & రూట్ మ్యాప్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ ప్రణాళిక.

ఉద్యమ ప్రధాన సంకల్పం & లక్ష్యం:

“విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి, 2026 పిఆర్సి (PRC) ప్రకారం మూలవేతనం పొందుకొనుటకై”

కార్యాచరణ అధికారిక డాక్యుమెంట్లు & ప్రచార సామగ్రి

అధికారులకు ఇచ్చే రిప్రజెంటేషన్ లేఖ & ప్రచార సామగ్రి డౌన్‌లోడ్ చేసుకోండి:

ఉద్యమ కార్యాచరణ రూట్ మ్యాప్ (13 దశలు)

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చారిత్రక కార్యాచరణ కాలపట్టిక

15-09-2026 నుండి 30-09-2026 వరకు కార్యాచరణ దశ #1

యాజమాన్య అధికారులకు వినతిపత్రాల (Representations) సమర్పణ

గౌరవ CMD గారి స్థాయి నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) గారి స్థాయి వరకు యాజమాన్యం వారికి మన డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేయడంతో పాటు, కార్యాచరణకు సంబంధించి రిప్రజెంటేషన్లను సమర్పించడం జరుగుతుంది.

01-10-2026 నుండి 31-10-2026 వరకు కార్యాచరణ దశ #2

ప్రజాప్రతినిధుల (MPs, MLAs, MLCs) కు వినతులు – సీఎం గారికి సిఫార్సు లేఖలు

రాష్ట్రంలోని గౌరవ పార్లమెంట్ సభ్యులు (MPs), శాసనసభ్యులు (MLAs), శాసనమండలి సభ్యులు (MLCs) మరియు ఇతర ప్రజాప్రతినిధులను కలిసి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వారి దృష్టికి తీసుకొని వెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి తమ తరఫున ఒక వినతి / సిఫారసు లేఖను పంపించవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ వినతిపత్రాలు (Representations) సమర్పించడం జరుగుతుంది.

మీ జిల్లా లెటర్‌ప్యాడ్‌పై రిప్రజెంటేషన్ పిడిఎఫ్ సిద్ధం చేసుకోండి (PDF & Image Support)
(ఫైల్ ఎంచుకోగానే ప్రాసెస్ అవుతుంది)
(To, మహారాజశ్రీ గౌరవనీయులైన, కింద ఈ వివరాలు నేరుగా ఎడమవైపు సమానంగా వస్తాయి)
03-11-2026 కార్యాచరణ దశ #3

గౌరవ SE & EE కార్యాలయాల వద్ద భద్రతా అవగాహన సదస్సులు

ప్రజల భద్రత పట్ల మన బాధ్యతగా, విద్యుత్ వినియోగంలో భద్రత మరియు ప్రమాదకర విధుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణ రక్షణపై గౌరవనీయులైన సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE), గౌరవనీయులైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) కార్యాలయాల వద్ద విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడం.

11-11-2026 కార్యాచరణ దశ #4

రాష్ట్రవ్యాప్త భారీ రక్తదాన శిబిరాలు (100 మందితో ఒక్కో కేంద్రం)

సామాజిక బాధ్యతగా రాష్ట్రంలోని అన్ని జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లలో ఒక్కో కేంద్రంలో 100 మందితో భారీ రక్తదాన శిబిరాల నిర్వహణ. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కార్మికులు ఎల్లప్పుడూ ముందుంటారని చాటే కార్యక్రమం.

15-11-2026 నుండి 27-11-2026 వరకు కార్యాచరణ దశ #5

13 రోజుల పాటు “కరెంటోళ్ళ ఐక్యతా సంకల్ప యాత్ర”

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి నుండి తిరుపతి వరకూ, సంస్థలో విలీనం కోరుతూ 13 రోజుల పాటు “కరెంటోళ్ళ ఐక్యతా సంకల్ప యాత్ర” నిర్వహించడం జరుగుతుంది.

07-12-2026 కార్యాచరణ దశ #6

కలెక్టర్ ఆఫీసుల ఎదుట “ఒక రోజు సామూహిక నిరాహార దీక్ష”

రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ఎదుట “ఒక రోజు సామూహిక నిరాహార దీక్ష” నిర్వహించడంతో పాటు, విద్యుత్ కార్మికుల సమస్యలపై “గౌరవ కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించడం” జరుగుతుంది.

14-12-2026 కార్యాచరణ దశ #7

తిరుపతి APSPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా”

తిరుపతిలోని APSPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.

21-12-2026 కార్యాచరణ దశ #8

RTPP థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా”

RTPP థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.

04-01-2027 కార్యాచరణ దశ #9

నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా”

నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.

08-01-2027 కార్యాచరణ దశ #10

విజయవాడ APCPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా”

విజయవాడలోని APCPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.

21-01-2027 కార్యాచరణ దశ #11

(VTPS) డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా”

(VTPS) ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.

28-01-2027 కార్యాచరణ దశ #12

విశాఖపట్నం APEPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా”

విశాఖపట్నంలోని APEPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.

10-02-2027 మహా కార్యాచరణ #13

🚩 “చలో విద్యుత్ సౌధ” విజయవాడ

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుండి వేలాదిగా తరలివచ్చే చారిత్రక మహా ఉద్యమ కార్యక్రమం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి, 2026 PRC ప్రకారం మూలవేతనం సాధించే దిశగా మన గళాన్ని బలంగా వినిపించే సమర శంఖారావం!

కార్మికుల ప్రధాన నినాదం: “విలీనం సాధించే వరకు విశ్రమించేది లేదు – హక్కుల సాధనే మన ధ్యేయం!”

డాక్యుమెంట్ ప్రివ్యూ (7 పేజీలు)

To, మహారాజశ్రీ గౌరవనీయులైన,
విషయం: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాసంస్థలైన ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కం కంపెనీలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేసుకొనుట గురించి.
అయ్యా!
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగసంస్థలైన ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ డిస్కం కంపెనీలలో ఔట్సోర్సింగ్ విధానంలో దాదాపు 30 సంవత్సరాలుగా 25 వేల మంది కార్మికులు విధులు నిర్వహించుచున్నాము. అత్యంత ప్రమాదకరమైనటువంటి పని ప్రదేశాలలో ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, ఆరోగ్య భరోసా, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కరువైనప్పటికీ ప్రజలకి, పరిశ్రమలకి, నిత్యవసరమైన విద్యుత్ ని అందించడంలో ఔట్సోర్సింగ్ కార్మికులుగా కీలకమైన పాత్ర పోషిస్తున్నాము.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధ్యతగా ఇతర జిల్లాలకు వెళ్లి విద్యుత్ ని పునరుద్ధరించడంలో ఔట్సోర్సింగ్ కార్మికులుగా మేము ముందుండి 24/7 సేవలు అందిస్తున్నాము ( ఉదాహరణకు: హుదూద్ తుఫాను, తిల్లి తుఫాను, కరోనా )
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మా తోటి విద్యుత్ ఔట్సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకొని మెరుగైన జీతభత్యాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు ఇతర అలవెన్సులు అన్ని అమలు చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలు అయినా తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఒడిస్సా, తదితర రాష్ట్రాల్లో కూడా అనేకమంది కార్మికులను రెగ్యులర్ చేశారు.
30 సంవత్సరాలు సర్వీసు చేసినప్పటికీ కనీసం రిటైర్మెంట్ అయితే ఒక్క రూపాయి కూడా ఆర్థిక ప్రయోజనం ( రిటైర్మెంట్ బెనిఫిట్ ) లేకుండా ఒట్టి చేతులతో సంస్థ నుండి వెళ్ళిపోతున్నాము.
విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది కార్మికులు చనిపోయారు, ఎంతోమంది శాశ్వత అంగవైకల్యంతో మంచాన పడి ఉన్నారు.
ఈ యొక్క ఔట్సోర్సింగ్ వ్యవస్థ ద్వారా కార్మికులకు, మా కుటుంబ సభ్యులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.
మన యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా ఔట్సోర్సింగ్ వ్యవస్థని రద్దుచేసి సంస్థలో విలీనం చేయడం ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న 25వేల మంది కార్మికులు, మా కుటుంబ సభ్యుల గుండెల్లో చెరగని చిహ్నంగా ఉంటారని ఆశిస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా మా యొక్క న్యాయమైన, చట్టబద్ధమైన, సమస్య అయినటువంటి ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి, కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి, సంస్థలో విలీనం చేసుకొని, రెగ్యులర్ చెయ్యాలి. దళారి వ్యవస్థను రద్దు చేయడం వలన దళారులకు చెల్లించే సూపర్వైజింగ్ చార్జెస్, GST, సర్వీస్ టాక్స్ రూపంలో సంవత్సరానికి ₹250 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు మిగులుతుంది.
కావున తమరు మా యందు దయవుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి సిఫారసు లేఖ రాయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇట్లు,
తమ విధేయులు,