Our Rights – Legal Evidence

మన తోటి కార్మికులతో పంచుకుందాం

మన హక్కులు – ప్రభుత్వ హామీలు – న్యాయపరమైన ఆధారాలు

OUR RIGHTS | GOVERNMENT PROMISES | LEGAL EVIDENCE

అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ లైన్లలో ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థల్లోకి విలీనం చేయడం, సమాన పనికి సమాన వేతనం కల్పించడం రాజ్యాంగబద్ధమైన హక్కు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల విలీన ఉత్తర్వులు, గౌరవ న్యాయస్థానాల ఆదేశాలు మరియు అధికారిక రికార్డుల సమగ్ర సంకలనం.

విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు…

నిరంతరం అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ లైన్లలో ప్రజలకు సేవలందిస్తూ తీవ్ర ప్రమాదాలకు గురైన కార్మికుల వాస్తవ పరిస్థితులు & ఆధారాలు

ప్రమాదాల ఫోటోలు వీక్షించండి →
గౌరవ న్యాయస్థానాల ఉత్తర్వులు
న్యాయపరమైన ఆదేశాలు (Judicial Precedents)

గౌరవ న్యాయస్థానాలు – ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థల్లో విలీనం & సమాన వేతనం ఉత్తర్వులు

గౌరవ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు వెలువరించిన చారిత్రక తీర్పుల ప్రకారం.. శాశ్వత స్వభావం గల పనుల్లో పనిచేస్తున్న కార్మికులను అనిశ్చితిలో ఉంచరాదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు 10 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను తక్షణమే చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

కీలక న్యాయ సూత్రం: ఆర్టికల్ 14, 21 పరిధిలో అత్యంత ప్రమాదకర పనుల్లో కాంట్రాక్ట్ విధానం రాజ్యాంగ విరుద్ధం; కాంట్రాక్ట్ సిబ్బందిని సంస్థల్లోకి విలీనం చేయడం సమర్థనీయం.
కోర్టు తీర్పు పూర్తి ఆర్డర్ కాపీని చూడండి →
తమిళనాడు ప్రభుత్వం విద్యుత్ విలీనం
విలీనం అమలైంది (TNEB Absorption)

తమిళనాడు ప్రభుత్వం – విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను 2007 మరియు 2009 సంస్థల్లో విలీనం చేసింది

తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (TNEB) లో పనిచేసిన వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ సెక్షన్ 12(3) మరియు Board Proceedings (Per) B.P. (FB) No.44 ద్వారా దశలవారీగా బోర్డు సర్వీసులోకి విలీనం (Absorption) చేసుకున్నారు. 480 రోజులు పూర్తి చేసుకున్న ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి శాశ్వత హోదా కల్పించారు.

కీలక ఉత్తర్వు: TNEB BP (FB) No.44 & Section 12(3) త్రైపాక్షిక చట్టబద్ధ సెటిల్‌మెంట్ అధికారిక కాపీ.
తమిళనాడు విలీన ఉత్తర్వులు (BP-44) చూడండి →
తెలంగాణ గవర్నమెంట్ విలీనం
23,600+ మంది ఆర్టిజన్స్ విలీనం

తెలంగాణ గవర్నమెంట్ – విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థల్లో విలీనం చేసుకుంది

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో (TSTRANSCO, TSSPDCL, TSNPDCL, TSGENCO) అమలులో ఉన్న థర్డ్ పార్టీ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, 23,600 మందికి పైగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని సంస్థల్లోకి విలీనం చేశారు. TSGENCO T.A.O.O. No.100 ఉత్తర్వుల ద్వారా వీరికి ఆర్టిజాన్స్ (Artisans Grade I-IV) గా సర్టిఫైడ్ స్టాండింగ్ ఆర్డర్స్, టైమ్‌స్కేల్, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఈపీఎఫ్/ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించారు.

కీలక ఉత్తర్వు: TSGENCO T.A.O.O.No.100/COM(Adm)/2020 & హైకోర్టు Common Order WP 20544/2017.
తెలంగాణ ఆర్టిజాన్ ఉత్తర్వులు (T.A.O.O-100) చూడండి →
ఒడిస్సా గవర్నమెంట్ విలీనం
కాంట్రాక్ట్ విధానం సంపూర్ణ రద్దు

ఒడిస్సా గవర్నమెంట్ – విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థల్లో విలీనం చేసుకుంది

ఒడిస్సా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంటూ ‘Odisha Group B, C and D Posts (Repeal and Special Provisions) Rules, 2022’ ద్వారా రాష్ట్రంలో కాంట్రాక్ట్ నియామకాల వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేసింది. విద్యుత్ మరియు వివిధ విభాగాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రభుత్వ సంస్థల్లో క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించింది.

కీలక ఉత్తర్వు: Odisha Special Provisions Rules, 2022 గెజిట్ నోటిఫికేషన్.
ఒడిస్సా ప్రభుత్వ గెజిట్ నిబంధనలు (2022) చూడండి →
మిజోరాం గవర్నమెంట్ విలీనం
క్రమబద్ధీకరణ పథకం (Regularisation Scheme)

మిజోరాం గవర్నమెంట్ – కార్మికులను సంస్థల్లో విలీనం చేసుకుంది

మిజోరాం ప్రభుత్వం ‘The Government of Mizoram Regularisation of Contract Employees Scheme, 2008’ ద్వారా నిరంతర సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. విద్యుత్ మరియు సాంకేతిక విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సర్వీసును గుర్తించి శాశ్వత సంస్థాగత ఉద్యోగులుగా క్రమబద్ధీకరించింది.

కీలక ఉత్తర్వు: Government of Mizoram Regularisation Scheme, 2008 మార్గదర్శకాలు.
మిజోరాం రెగ్యులరైజేషన్ స్కీమ్ కాపీ చూడండి →
పంజాబ్ గవర్నర్ విలీనం చట్టం
అసెంబ్లీ ప్రత్యేక చట్టం (Bill No. 38)

పంజాబ్ గవర్నర్ – విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థల్లో విలీనం చేసుకుంది

పంజాబ్ ప్రభుత్వం అసెంబ్లీలో ‘The Punjab Protection and Regularisation of Contractual Employees Bill, 2021 (Bill No. 38-PLA-2021)’ ఆమోదించి విద్యుత్ సంస్థలతో సహా అన్ని విభాగాల్లోని కాంట్రాక్ట్, తాత్కాలిక కార్మికులకు చట్టబద్ధమైన రక్షణ మరియు రెగ్యులరైజేషన్ హక్కును కల్పించింది.

కీలక చట్టం: పంజాబ్ ప్రభుత్వం ఆమోదించిన Bill No. 38-PLA-2021 చట్టబద్ధ కాపీ.
పంజాబ్ ప్రొటెక్షన్ చట్టం (Act Copy) చూడండి →
ఆంధ్రప్రదేశ్ కమిటీల జాప్యం
10 నెలలు గడిచినా తేలని రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కమిటీల పేరుతో సాగుతూనే ఉంది

పక్క రాష్ట్రాలు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థల్లో విలీనం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విలీన హామీలను దాటవేస్తూ కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు. APTRANSCO T.O.O. Ms.No.3809 ద్వారా 3 నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీని నియమించి దాదాపు 10 నెలలు గడిచినా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు.

అధికారిక ఉత్తర్వు (షీట్ నెం 24): T.O.O. (Addl. Secy.–Per) Ms.No.3809 – Outsourced Workers సమస్యలపై కమిటీ ఏర్పాటు ఉత్తర్వుల కాపీ.
కమిటీ ఉత్తర్వుల అసలైన ఆర్డర్ కాపీ (Ms.No.3809) చూడండి →

రాజకీయ పార్టీల హామీలు – ప్రభుత్వ ఆదేశాలు – కోర్టు తీర్పులు – నివేదికలు – ఉత్తర్వులు…

అధికారిక పత్రాలు, వినతిపత్రాలు, మరియు జీవోల సమగ్ర జాబితా

రాజకీయ హామీ 22-09-2011 ID: REF-11

విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి – చంద్రబాబు

విద్యుత్ రంగంలో ప్రమాదకర విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, వారి సేవలకు పూర్తి భద్రత కల్పించాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసిన అధికారిక ప్రకటన పత్రం.

ప్రజా ప్రతినిధి విజ్ఞప్తి 22-08-2022 ID: REF-18

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, థర్డ్ పార్టీ రద్దు – నారా లోకేష్

విద్యుత్ కార్మికులను దోపిడీ చేస్తున్న థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి వారిని నేరుగా సంస్థల్లోకి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ నారా లోకేష్ గారు రాసిన లేఖ & ప్రకటన.

రాజకీయ పార్టీ లేఖ 10-07-2022 ID: REF-17

జనసేన – విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై విజ్ఞప్తి

విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయమైన వేతనాలు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వానికి సమర్పించిన అధికారిక విజ్ఞప్తి పత్రం.

ప్రభుత్వ జీవో (G.O.) 24-01-2011 ID: REF-20

33/11 KV సబ్‌స్టేషన్ల పనులు “Core Activity”గా గుర్తింపు – G.O.Ms.No.5

Contract Labour (Regulation & Abolition) Act, 1970 ప్రకారం సబ్‌స్టేషన్ల నిర్వహణ అనేది నిరంతరాయంగా జరిగే ప్రధాన విధి (Core Activity) కాబట్టి అక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ తగదని స్పష్టం చేసిన జీవో.

AP TRANSCO అధికారిక లేఖ 26-06-2018 ID: REF-03

APTRANSCO – Equal Pay & Direct Payment to Outsourced Workers

ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, మరియు దళారీలు లేకుండా నేరుగా వేతనాల చెల్లింపులపై సంస్థ అంతర్గత వనరుల నుంచే ఖర్చును భరిస్తామని APTRANSCO ప్రభుత్వానికి సమర్పించిన లేఖ.

AP TRANSCO లేఖ 30-10-2017 ID: REF-05

AP Power Utilities – Equal Pay & Direct Payment Proposals

AP Power Utilities (APTRANSCO, APGENCO, DISCOMs) లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ టైమ్‌స్కేల్ కనీస వేతనం ఇవ్వాలని మరియు ప్రత్యక్ష చెల్లింపులు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించిన లేఖ.

సుప్రీంకోర్టు తీర్పు 31-01-2025 ID: REF-09

Shripal & Anr. Vs. Nagar Nigam, Ghaziabad (2025 INSC 144)

శాశ్వత స్వభావం గల పనులు చేయిస్తూ కార్మికులను టెంపరరీ/కాంట్రాక్ట్ పేరుతో నిరంతరం అనిశ్చితిలో ఉంచడం చట్టవిరుద్ధమని మరియు Equal Pay for Equal Work సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు.

సుప్రీంకోర్టు తీర్పు 19-08-2025 ID: REF-10

Dharam Singh & Ors. Vs. State of U.P. (2025 INSC 998)

శాశ్వత పనులకు తగిన విధంగా పోస్టులను సృష్టించాలి గానీ, ‘ఆర్థిక ఇబ్బందులు’ అనే నెపంతో కార్మికుల రెగ్యులరైజేషన్‌ను నిరాకరించడం సమర్థనీయం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన తీర్పు.

సుప్రీంకోర్టు తీర్పు 22-08-2025 ID: REF-13

Shah Samir Bharatbhai Vs. State of Gujarat (2025 INSC 1026)

గుజరాత్ విద్యుత్ మరియు ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ సిబ్బంది సర్వీసుల గుర్తింపు మరియు సమాన హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు ఆర్డర్ కాపీ.

మద్రాస్ హైకోర్టు తీర్పు 19-05-2025 ID: REF-16

480 రోజులు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు శాశ్వత హోదా

తమిళనాడు పారిశ్రామిక చట్టం ప్రకారం 24 నెలల కాలంలో 480 రోజులు నిరంతరంగా పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసిన తీర్పు కథనం.

హైకోర్టు కామన్ ఆర్డర్ 18-09-2018 ID: REF-23

M. Sravan Kumar vs. C.S., State of Telangana (WP 20544/2017)

తెలంగాణ విద్యుత్ సంస్థలు ఔట్‌సోర్సింగ్ కార్మికులను విలీనం చేయడానికి కుదిరిన 12(3) సెటిల్‌మెంట్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని, ఆ చర్యలు చట్టబద్ధమేనని డివిజన్ బెంచ్ ధృవీకరించిన ఉత్తర్వు.

APTRANSCO ఉత్తర్వు 04-12-2017 ID: REF-19

T.O.O. Ms.No.632 – Equal Pay & Direct Payment Committee

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సమాన వేతనం మరియు నేరుగా చెల్లింపులను అమలు చేయడంపై అధికారులతో నియమించిన కమిటీ ఉత్తర్వులు.

వార్తా కథనం అధికారిక కథనం ID: REF-02

థర్డ్ పార్టీ సోర్సింగ్ విధానం రద్దు – సంస్థల్లో కాంట్రాక్ట్ గుర్తింపు

విద్యుత్ సంస్థల్లో దళారీ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల విధానాన్ని తొలగించి, సంస్థల పరిధిలోనే కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి నేరుగా వేతనాలు అందించిన నిర్ణయంపై కథనం.

న్యాయ కథనం 19-09-2018 ID: REF-06

వారిని పర్మినెంట్ చేయొచ్చు – ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం

విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ పరిధిలో పర్మినెంట్ చేయడం, సర్వీసులను క్రమబద్ధీకరించడం సాధ్యమేనని వివరించిన కథనం.

సోషల్ మీడియా ప్రకటన 22-08-2022 ID: REF-22

నారా లోకేష్ – విద్యుత్ కార్మికుల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ

విద్యుత్ రంగంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది శ్రమను గుర్తించి, రాబోయే రోజుల్లో వారికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తామని వెల్లడించిన అధికారిక ప్రకటన ప్రతి.