ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ
APVCW JAC అధికారిక ఉద్యమ కార్యాచరణ & రూట్ మ్యాప్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ ప్రణాళిక.
జేఏసీతో నేను సైతం – ఉమ్మడి 13 జిల్లాల వాట్సాప్ గ్రూప్లు
ఉద్యమ కార్యాచరణ రూట్ మ్యాప్ (13 దశలు)
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చారిత్రక కార్యాచరణ కాలపట్టిక
యాజమాన్య అధికారులకు వినతిపత్రాల (Representations) సమర్పణ
గౌరవ CMD గారి స్థాయి నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) గారి స్థాయి వరకు యాజమాన్యం వారికి మన డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేయడంతో పాటు, కార్యాచరణకు సంబంధించి రిప్రజెంటేషన్లను సమర్పించడం జరుగుతుంది.
ప్రజాప్రతినిధుల (MPs, MLAs, MLCs) కు వినతులు – సీఎం గారికి సిఫార్సు లేఖలు
రాష్ట్రంలోని గౌరవ పార్లమెంట్ సభ్యులు (MPs), శాసనసభ్యులు (MLAs), శాసనమండలి సభ్యులు (MLCs) మరియు ఇతర ప్రజాప్రతినిధులను కలిసి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వారి దృష్టికి తీసుకొని వెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి తమ తరఫున ఒక వినతి / సిఫారసు లేఖను పంపించవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ వినతిపత్రాలు (Representations) సమర్పించడం జరుగుతుంది.
గౌరవ SE & EE కార్యాలయాల వద్ద భద్రతా అవగాహన సదస్సులు
ప్రజల భద్రత పట్ల మన బాధ్యతగా, విద్యుత్ వినియోగంలో భద్రత మరియు ప్రమాదకర విధుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణ రక్షణపై గౌరవనీయులైన సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE), గౌరవనీయులైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) కార్యాలయాల వద్ద విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడం.
రాష్ట్రవ్యాప్త భారీ రక్తదాన శిబిరాలు (100 మందితో ఒక్కో కేంద్రం)
సామాజిక బాధ్యతగా రాష్ట్రంలోని అన్ని జిల్లా హెడ్క్వార్టర్స్లలో ఒక్కో కేంద్రంలో 100 మందితో భారీ రక్తదాన శిబిరాల నిర్వహణ. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కార్మికులు ఎల్లప్పుడూ ముందుంటారని చాటే కార్యక్రమం.
13 రోజుల పాటు “కరెంటోళ్ళ ఐక్యతా సంకల్ప యాత్ర”
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి నుండి తిరుపతి వరకూ, సంస్థలో విలీనం కోరుతూ 13 రోజుల పాటు “కరెంటోళ్ళ ఐక్యతా సంకల్ప యాత్ర” నిర్వహించడం జరుగుతుంది.
కలెక్టర్ ఆఫీసుల ఎదుట “ఒక రోజు సామూహిక నిరాహార దీక్ష”
రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ఎదుట “ఒక రోజు సామూహిక నిరాహార దీక్ష” నిర్వహించడంతో పాటు, విద్యుత్ కార్మికుల సమస్యలపై “గౌరవ కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించడం” జరుగుతుంది.
తిరుపతి APSPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా”
తిరుపతిలోని APSPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.
RTPP థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా”
RTPP థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.
నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా”
నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.
విజయవాడ APCPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా”
విజయవాడలోని APCPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.
(VTPS) డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా”
(VTPS) ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.
విశాఖపట్నం APEPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా”
విశాఖపట్నంలోని APEPDCL కార్పొరేట్ ఆఫీసు ఎదుట “మహా ధర్నా” నిర్వహించడం జరుగుతుంది.
🚩 “చలో విద్యుత్ సౌధ” విజయవాడ
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుండి వేలాదిగా తరలివచ్చే చారిత్రక మహా ఉద్యమ కార్యక్రమం. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసి, 2026 PRC ప్రకారం మూలవేతనం సాధించే దిశగా మన గళాన్ని బలంగా వినిపించే సమర శంఖారావం!